వివో ఫోన్లపై అమెజాన్‌లో ఆఫర్లు..!


Thu,November 16, 2017 11:49 AM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వివో అమెజాన్ సైట్‌లో వింటర్ కార్నివాల్ పేరిట ప్రత్యేక ఆఫర్లను యూజర్లకు అందిస్తున్నది. వివోకు చెందిన వీ7 ప్లస్, వీ5ఎస్, వీ5 ప్లస్, వై69, వై66, వై53, వై55ఎస్ ఫోన్లను కొనే యూజర్లకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఈ ఆఫర్లు లభిస్తాయి. ఇందులో భాగంగా పాత ఫోన్లపై రూ.3వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ను యూజర్లు పొందవచ్చు. అమెజాన్ పే వాలెట్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి వివో ఫోన్‌ను కొంటే అదనంగా మరో రూ.2వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పైన చెప్పిన వివో ఫోన్లను కొన్న యూజర్లకు బుక్ మై షో ద్వారా సినిమా టిక్కెట్లను ఉచితంగా అందివ్వనున్నారు. వివోకు చెందిన వీ7 ప్లస్ ఫోన్‌పై ప్రత్యేకంగా ఓ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను కొంటే స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను ఏడాదిలో ఒకసారి ఉచితంగా పొందవచ్చు.

1202

More News

VIRAL NEWS