ఈ నెల 26న విడుదల కానున్న వివో వి9 ప్రొ స్మార్ట్‌ఫోన్


Mon,September 24, 2018 07:05 PM

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వి9 ప్రొ ను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. బ్లాక్, రెడ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.

వివో వి9 ప్రొ ఫీచర్లు...


6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

4972

More News

VIRAL NEWS