ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన వివో వి9 ప్రొ స్మార్ట్‌ఫోన్


Wed,September 26, 2018 02:47 PM

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వి9 ప్రొ ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఈ ఫోన్‌లో అమర్చారు. స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. దీని వల్ల ఈ ఫోన్ అత్యుత్తమమైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలను, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను అమర్చారు. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఉంది. ఇక ఈ ఫోన్ రూ.17,990 ధరకు అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నది.

వివో వి9 ప్రొ ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ.

1375

More News

VIRAL NEWS

Featured Articles