వివో వీ7 స్మార్ట్‌ఫోన్ విడుదల


Mon,November 20, 2017 02:34 PM

వివో సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'వీ7'ను ఇవాళ విడుదల చేసింది. ఇందులో 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన బెజెల్ లెస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 24 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీనికి ఫ్లాష్‌లైట్ కూడా ఉంది. ఈ కెమెరా సహాయంతో యూజర్లు తమ ఫేస్‌ను పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుంటే దాంతో ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పోర్ట్రెయిట్ మోడ్ అనే ఫీచర్‌ను కెమెరా యాప్‌లో అందిస్తున్నారు. వెనుక భాగంలో 16 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి కూడా ఫ్లాష్ లైట్ ఉంది. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం ప్రత్యేక స్లాట్ ఇచ్చారు. దీంతో రెండు సిమ్‌లతోపాటు, మెమొరీ కార్డును కూడా ఈ ఫోన్‌లో వేసుకోవచ్చు. వివో వీ7 స్మార్ట్‌ఫోన్ మ్యాట్ బ్లాక్, షాంపేన్ గోల్డ్ రంగుల్లో రూ.18,990 ధరకు యూజర్లకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభిస్తున్నది. దీన్ని ఈ నెల 24వ తేదీ నుంచి విక్రయించనున్నారు.

వివో వీ7 ఫీచర్లు...


5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1584

More News

VIRAL NEWS