వివో వీ5 ఫోన్లు కూడా పేలుతున్నాయ్..?


Wed,May 3, 2017 12:04 PM

శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ నోట్ 7 ఫోన్లే అనుకున్నాం..! కానీ ఇప్పుడు ఆ కోవలోకి వివోకు చెందిన వీ5 ఫోన్ కూడా వచ్చి చేరిందా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లు బ్యాటరీ సమస్య వల్ల పేలాయి కదా..! ఇప్పుడు తాజాగా వివో వీ5 ఫోన్లు కూడా పేలుతున్నాయట.
vivo-v5
గత 24 గంటల్లోనే రెండు సంఘటనల్లో వివో వీ5 ఫోన్లు పేలినట్టు తెలిసింది. హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో చార్జింగ్ పెట్టిన వివో వీ5 స్మార్ట్‌ఫోన్ నుంచి మంటలు వచ్చాయి. అలాగే మరో చోట కూడా ఈ ఫోన్ బ్యాటరీ పేలినట్టు తెలిసింది. దీంతో ఈ ఫోన్‌కు చెందిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే వివో సంస్థ ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు..!

3829

More News

VIRAL NEWS