ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన వివో వి11 స్మార్ట్‌ఫోన్


Tue,September 25, 2018 05:53 PM

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వి11 ను భారత మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఇందులో అమర్చారు. 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. ఇందులో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు. వివో వి11 స్మార్ట్‌ఫోన్ స్టారీ నైట్ బ్లాక్, నెబ్యులా పర్పుల్ కలర్ వేరియెంట్లలో రూ.22,900 ధరకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా లభ్యం కానుంది.

ఈ నెల 27వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఈ సందర్భంగా పలు ఆఫర్లు వినియోగదారులకు లభిస్తాయి. క్యాపిటల్ ఫస్ట్ ఈఎంఐతో ఫోన్‌ను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. పేటీఎం మాల్‌తో కొనుగోలు చేస్తే రూ.2వేల క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులతో రూ.2వేల క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ల ఎక్స్‌ఛేంజ్‌పై రూ.2వేలు అదనంగా డిస్కౌంట్ ఇస్తారు. ఇక ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. రిలయన్స్ జియో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.4050 విలువైన బెనిఫిట్స్‌ను అందిస్తుంది.

వివో వి11 ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3315 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2336
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles