ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన వివో యు1 స్మార్ట్‌ఫోన్


Tue,February 19, 2019 05:55 PM

మొబైల్స్ త‌యారీదారు వివో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వివో యు1 ను ఇవాళ చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండింటిని అమ‌ర్చారు. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను అమ‌ర్చ‌గా, 4030 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాట‌రీని ఇందులో అమ‌ర్చారు. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.8,430 ధ‌ర‌కు ల‌భ్యం కానుండ‌గా, 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.12,645 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది.

వివో యు1 ఫీచ‌ర్లు...


6.22 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 439 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1690

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles