వివో ఫోన్లకు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్


Tue,February 13, 2018 06:53 PM

మొబైల్స్ తయారీదారు వివో తన స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్ అప్‌డేట్‌ను అందివ్వనున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌లో పలు వివో ఫోన్లకు ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ లభ్యం కానుంది. వివోకు చెందిన ఎక్స్20, ఎక్స్20 ప్లస్, ఎక్స్9ఎస్, ఎక్స్9ఎస్ ప్లస్, ఎక్స్‌ప్లే6, ఎక్స్9, ఎక్స్9 ప్లస్ ఫోన్లకు ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్‌ను విడుదల చేయనున్నారు. ఈ అప్‌డేట్ యూజర్లకు ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) రూపంలో లభిస్తుంది. అందుకు గాను ఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి అబౌట్ ఫోన్‌లో ఉండే సిస్టమ్ అప్‌డేట్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో కొత్త ఓఎస్ అప్‌డేట్ వచ్చింది, డౌన్‌లోడ్ చేసుకుంటారా అని డివైస్ యూజర్‌ను అడుగుతుంది. అందుకు ప్రొసీడ్ బటన్‌ను క్లిక్ చేస్తే కొత్త ఓఎస్ ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. అనంతరం దాన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని కొత్త ఓఎస్‌లో ఉండే ఫీచర్లను ఆస్వాదించవచ్చు.

1950

More News

VIRAL NEWS