భారత్‌లో వివో నూతన ప్లాంట్.. అదనంగా 8.4 మిలియన్ల ఫోన్ల ఉత్పత్తి..!


Thu,November 7, 2019 11:08 AM

మొబైల్స్ తయారీదారు వివో భారత్‌లో మరో నూతన ప్లాంట్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. రూ.7500 కోట్ల భారీ పెట్టుబడితో ఫేజ్ 1 ప్రాజెక్టులో భాగంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు వివో వెల్లడించింది. 2020 వరకు ఫేజ్ 2లో భాగంగా కంపెనీని మరింత విస్తరిస్తామని వివో తెలిపింది. కాగా నూతన ప్లాంట్‌ను గ్రేటర్ నోయిడాలోని డబ్ల్యూటీసీ టెక్ జోన్‌లో ఏర్పాటు చేయగా అందులో అదనంగా 8.4 మిలియన్ ఫోన్లను ఏటా ఉత్పత్తి చేయనున్నారు. దీంతో వివో భారత్‌లో ఉన్న తన ప్లాంట్ల ద్వారా ఏటా మొత్తం 33 మిలియన్ల యూనిట్లను ఉత్పత్తి చేయనుంది. ఇక ఈ ప్లాంట్‌లో అదనంగా 2వేల మందికి ఉపాధి లభిస్తుందని, ఫేజ్ 2లో భాగంగా మరో 5వేల మంది ఉద్యోగులను కొత్తగా కంపెనీలోకి తీసుకోనున్నామని వివో వెల్లడించింది.

991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles