'వివో' కొత్త స్మార్ట్‌ఫోన్లు అదుర్స్..!

Sat,January 9, 2016 03:59 PM

ప్రముఖ మొబైల్ తయారీదారు వివో 'లాస్‌వెగాస్ కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) 2016'లో తన కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. 'బ్లూ వివో 5, బ్లూ వివో ఎక్స్‌ఎల్‌ల పేరిట ప్రదర్శింపబడిన ఈ ఫోన్లు ఇంతకు ముందు వచ్చిన వివో స్మార్ట్‌ఫోన్ల కన్నా తక్కువ ధరనే కలిగి ఉండడంతోపాటు యూజర్లను అమితంగా ఆకట్టుకునే ఫీచర్లను వీటిలో అందిస్తున్నారు. బ్లూ వివో 5 ధర రూ.13,250 ఉండగా, బ్లూ వివో ఎక్స్‌ఎల్ ధర రూ.10వేలుగా నిర్ణయించారు. ప్రస్తుతం అమెరికాలోని కొన్ని స్టోర్స్‌తోపాటు అక్కడి వినియోగదారులకు అమెజాన్ సైట్ ద్వారా ఇవి లభిస్తుండగా, మరికొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్త వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

బ్లూ వివో 5 ఫీచర్లు...
▪ 5.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
▪ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
▪ ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్
▪ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ (అప్‌గ్రేడబుల్ టు మార్ష్‌మాలో)
▪ 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
▪ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
▪ 4జీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3150 ఎంఏహెచ్ బ్యాటరీ

బ్లూ వివో ఎక్స్‌ఎల్ ఫీచర్లు...
▪ 5.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
▪ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
▪ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ (అప్‌గ్రేడబుల్ టు మార్ష్‌మాలో)
▪ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
▪ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
▪ ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్
▪ 4జీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3150 ఎంఏహెచ్ బ్యాటరీ

11378

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles