వివో గ్రాండ్ దివాలీ సేల్.. వివో ఫోన్లపై ఆఫర్లు..!


Mon,November 5, 2018 04:41 PM

మొబైల్స్ తయారీదారు వివో దీపావళి సందర్భంగా వివో గ్రాండ్ దివాలీ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా వివో వి9 ప్రొ, వీ11 ప్రొ, వీ11, వీ9, వీ9 యూత్, వై66, వై83 ఫోన్లపై వివో ఆకట్టుకునే ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఫోన్లను కొనుగోలు చేసే వారికి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తున్నారు. అలాగే బై బ్యాక్ స్కీంలు, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా వివో అందిస్తున్నది.

వివో దీపావళి సేల్‌లో వి9 ప్రొ 6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.17,990 ధరకు, 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.15,990 ధరకు లభిస్తున్నాయి. అలాగే.. వి9 స్మార్ట్‌ఫోన్ రూ.15,990 ధరకు లభిస్తున్నది. వివో వీ9 యూత్ స్మార్ట్‌ఫోన్ రూ.13,990 ధరకు, వై66 రూ.11,499కు లభిస్తున్నాయి. వివో వి11, వి11 ప్రొ ఫోన్లపై వన్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందిస్తున్నారు. వివో నెక్స్, వి11, వి11 ప్రొ, వి9 ఫోన్లకు బ్లూటూత్ హెడ్‌పోన్స్ అందిస్తున్నారు.

1970

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles