నెక్స్ ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన వివో


Wed,June 13, 2018 02:24 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ నెక్స్ ఎస్‌ను తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో మాత్రమే లభిస్తున్నది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ లభ్యం కానుంది. డైమండ్ బ్లాక్, రెడ్ కలర్స్‌లో 6/8 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.41వేలు, రూ.47వేల ధరలకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

వివో నెక్స్ ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 6.59 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్క్రీన్ టు బాడీ రేషియో 91.24 శాతం ఉన్నందున ఫోన్ డిస్‌ప్లే పూర్తిగా అంచుల వరకు ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో పై భాగంలో డిస్‌ప్లే కింద మైక్రో స్లిట్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల దాంట్లో ఉండే 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా యూజర్ కావాలనుకున్నప్పుడు పైకి ఓపెన్ అవుతుంది. దాంతో ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు.


ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. వివో తన ఎక్స్20 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసినట్లే నెక్స్ ఎస్ ఫోన్‌లోనూ ఆ సెన్సార్‌ను డిస్‌ప్లే కిందే అమర్చింది. దీంతో డివైస్‌ను గతంలో వచ్చిన వివో ఫోన్ల కన్నా వేగంగా అన్‌లాక్ చేసుకోవచ్చు. దాదాపుగా 50 శాతం వేగంగా ఈ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కచ్చితత్వంతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. అలాగే స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది.


వివో నెక్స్ ఎస్ ఫీచర్లు...

6.59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2316 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2179

More News

VIRAL NEWS