డ్యుయల్ డిస్‌ప్లే ఫోన్‌ను విడుదల చేసిన వివో


Sat,December 15, 2018 03:32 PM

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ నెక్స్ డ్యుయల్‌ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో రెండు డిస్‌ప్లేలు ఉన్నాయి. 6.39 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఒక వైపు, 5.49 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే మరో వైపు ఉంటాయి. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 10 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 12, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు వెనుక భాగంలో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ ఐస్ బ్లూ, స్టార్ పర్పుల్ కలర్ వేరియెంట్లలో రూ.52,080 ధరకు వినియోగదారులకు ఈ నెల 29వ తేదీ నుంచి లభ్యం కానుంది.

వివో నెక్స్ డ్యుయల్ డిస్‌ప్లే ఫోన్ ఫీచర్లు...


6.39 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 5.49 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 10 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

3491

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles