అమెజాన్‌లో వివో కార్నివాల్ సేల్.. వివో ఫోన్లపై డిస్కౌంట్లు..!


Tue,February 13, 2018 05:03 PM

స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో అమెజాన్‌లో వివో కార్నివాల్ స్పెషల్ ఆన్‌లైన్ సేల్‌ను నిర్వహిస్తున్నది. నిన్న ప్రారంభమైన ఈ సేల్ రేపటి వరకు కొనసాగుతుంది. ఇందులో మొత్తం 9 వివో ఫోన్లపై డిస్కౌంట్లు, ఆఫర్లు లభిస్తున్నాయి. వివో వీ7 ప్లస్, వీ7, వీ5 ప్లస్, వీ5ఎస్, వై69, వై66, వై55ఎస్, వై53 ఫోన్లను ఈ ఆఫర్‌లో తగ్గింపు ధరలకు అందిస్తున్నారు.

వివో కార్నివాల్ సేల్‌లో వీ7 ప్లస్‌కు చెందిన ఎరుపు రంగు వేరియెంట్ రూ.22,990 ధరకు లభిస్తుండగా, ఇదే ఫోన్‌కు చెందిన ఇతర కలర్ వేరియెంట్లు రూ.21,990కి లభ్యమవుతున్నాయి. అలాగే వివో వీ7 రూ.2వేలు తగ్గి రూ.16,990కి, వీ5 ప్లస్ రూ.6వేలు తగ్గి రూ.19,990కి, వీ5ఎస్ రూ.3వేలు తగ్గి రూ.15,990కి లభిస్తున్నాయి. ఇవే కాకుండా వివో వై69 రూ.1వేయి తగ్గి రూ.13,990కి, వై66 రూ.1వేయి తగ్గి రూ.12,990కి, వై55ఎస్ రూ.1వేయి తగ్గి రూ.10,990కి, వై53 రూ.1వేయి తగ్గి రూ.8,990కి లభిస్తున్నాయి.

వివో కార్నివాల్ సేల్‌లో వీ5 ప్లస్‌పై రూ.3వేలు, వీ5ఎస్, వై69పై రూ.2500, వీ7ప్లస్, వీ7లపై రూ.2వేలు, వై55ఎస్, వై53లపై రూ.1500, వై66 ఫోన్‌పై రూ.4వేల వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. వివో వీ7 ప్లస్ ఇన్ఫినిట్ రెడ్ కలర్ వేరియెంట్‌ను కొనుగోలు చేస్తే రూ.3వేల వరకు స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే ఫెర్న్స్ అండ్ పెటల్స్‌కు చెందిన రూ.500 వోచర్ ఇస్తారు. దీంతోపాటు రూ.500 విలువ కలిగిన బుక్ మై షో వోచర్ కూడా వస్తుంది. ఇక ఈ ఫోన్‌కు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు.

2520

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles