నూత‌న స‌బ్‌బ్రాండ్ కింద ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌నున్న వివో


Tue,February 12, 2019 05:51 PM

మొబైల్స్ తయారీదారు వివో ఐక్యూ(iQOO) పేరిట ఓ నూత‌న స‌బ్ బ్రాండ్‌ను చైనాలో ఇవాళ ప్ర‌వేశ‌పెట్టింది. ఇక‌పై ఈ బ్రాండ్ పేరు కింద కూడా వివో ఫోన్ల‌ను త‌యారు చేసి విక్ర‌యించ‌నుంది. అయితే ఈ బ్రాండ్ కింద కేవ‌లం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల‌ను మాత్ర‌మే త‌యారు చేయాల‌ని వివో భావిస్తున్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే షియోమీ, నూబియాలు ఈ విష‌యంలో ప్రీమియం ఫోన్ల‌ను త‌యారు చేసి క్లిక్ అయ్యాయి. దీంతో వివో కూడా అదే బాట‌లో ప‌య‌నించాలని చూస్తున్న‌ట్లు సమాచారం. ఇక కొత్త బ్రాండ్ కింద వివో మ‌రో రెండు, మూడు నెల‌ల్లో నూత‌న స్మార్ట్‌ఫోన్ల‌ను విడుద‌ల చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు కూడా తెలిసింది.

2679

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles