విరాట్ కోహ్లి అఫిషియల్ యాప్ విడుదల


Mon,November 5, 2018 05:56 PM

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి నేడు తన 30వ జన్మదినాన్ని జరుపుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా కోహ్లి అభిమానులు అతనికి జన్మదిన శుభాకాంక్షలను తమదైన శైలిలో తెలియజేస్తున్నారు. కాగా కోహ్లి పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ కోహ్లి అఫిషియల్ మొబైల్ యాప్‌ను లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ఈ యాప్ లభిస్తున్నది. ఈ యాప్ ద్వారా కోహ్లి అభిమానులు అతనికి చెందిన తాజా వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే కోహ్లి తన అభిమానులతో ఈ యాప్ ద్వారా నేరుగా సంభాషణ జరపవచ్చు. అదేవిధంగా కోహ్లికి చెందిన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం ఖాతాలను కూడా ఈ యాప్‌లో మిళితం చేశారు. అందువల్ల ఆ అకౌంట్లలో కోహ్లి పోస్ట్ చేసే అప్‌డేట్స్‌ను ఈ యాప్ ద్వారా ఒకేసారి తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ ఆపైన వెర్షన్, ఐఓఎస్ 10 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్‌ను యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ యాప్ లభిస్తుండగా, యాపిల్ యాప్ స్టోర్‌లో ఐఓఎస్ యాప్ లభిస్తున్నది.

1940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles