'తేజ్‌'లో బిల్లు చెల్లించండి.. రూ.1000 వరకు గెలుచుకోండి!


Fri,September 28, 2018 05:40 PM

ముంబయి: భారత్‌లోని క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై ఉబెర్ క్యాబ్, ఆటో, మోటో రైడర్లు.. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ మొబైల్ పేమెంట్స్ యాప్ 'గూగుల్ పే'(తేజ్) ద్వారా నగదు చెల్లించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపాయి. రైడర్లు ఇక నుంచి ఉబెర్ యాప్‌లో గూగుల్ పేను తమ పేమెంట్ ఆప్షన్‌గా వినియోగదారులు ఎంచుకునే వీలుంది. దీని కోసం యూజ‌ర్లు త‌మ యాప్‌ల‌ను అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. భారత్‌లో ప్రతి నెలా ఈ యాప్‌ను దాదాపు 2.2కోట్ల మందికి పైగా వినియోగిస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు డైరెక్ట్‌గా క్యాష్ చెల్లింపు సదుపాయంతో పాటు యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులు, జియో మనీ, గిఫ్ట్ కార్డుల ద్వారా ఉబెర్ రైడర్లు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి 'గూగుల్ పే' నగదు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. వినియోగదారులు చెల్లించే ప్రతి బిల్లుకు ఒక స్క్రాచ్ కార్డు లభిస్తుంది. దీన్ని స్క్రాచ్ చేస్తే రూ.1000 వరకు నగదును గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ పేర్కొంది.3014

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles