ఊబ‌ర్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు, సైకిల్స్


Mon,January 21, 2019 04:52 PM

ఊబ‌ర్ కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు, సైకిల్స్‌ను రూపొందిస్తున్న‌ద‌ని గ‌తంలో వార్త‌లు వచ్చిన విష‌యం విదిత‌మే. అయితే ఈ వాహ‌నాల‌ను త‌యారు చేసేందుకు ప్ర‌స్తుతం ఆ కంపెనీ ఇంజినీర్లు, టెక్నాల‌జీ నిపుణుల కోసం అన్వేషిస్తున్న‌ట్లు తెలిసింది. ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు, సైకిళ్లు వాటంత‌ట అవే కస్ట‌మ‌ర్ల వ‌ద్ద‌కు చేరుకోవ‌డంతోపాటు చార్జింగ్ పాయింట్ల వ‌ద్ద‌కు వెళ్తాయ‌ని తెలిసింది. కస్ట‌మ‌ర్ల‌ను ఎక్కించుకుని వారిని త‌మ త‌మ గమ్య‌స్థానాల్లో దింపుతూ ఈ వాహ‌నాలు ముందుకు సాగుతాయి. ఇక వాహ‌నాలు ఉప‌యోగంలో లేని స‌మ‌యంలో వాటిని ఎంపిక చేసిన కాంట్రాక్ట‌ర్లు రిపేర్ చేసి చార్జింగ్ పెడ‌తారు. ఈ క్ర‌మంలోనే ఈ వాహ‌నాల రూప‌క‌ల్ప‌న కోసం ఊబ‌ర్ ప్ర‌త్యేకంగా ఓ టీమ్‌నే నియ‌మిస్తున్న‌ట్లు తెలిసింది. ఇక ఈ వాహ‌నాలు ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తాయో వేచి చూస్తే తెలుస్తుంది.

3007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles