వాట్సాప్‌లో వస్తున్న రెండు అద్భుతమైన ఫీచర్లివే..!


Wed,October 18, 2017 08:31 AM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో రెండు కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి లైవ్ లొకేషన్ షేరింగ్, కాగా రెండోది ఫోన్ నంబర్ చేంజ్ నోటిఫికేషన్. వాట్సాప్ ఉపయోగిస్తున్న యూజర్లు తమ లైవ్ లొకేషన్‌ను అవతలి వాట్సాప్ యూజర్లకు లేదా వాట్సాప్ గ్రూప్‌నకు షేర్ చేయవచ్చు. 15 నిమిషాలు, 1 గంట లేదా 8 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వాట్సాప్ యూజర్లు తమ లైవ్ లొకేషన్‌ను షేర్ చేయవచ్చు. దీంతో యూజర్లు ఎక్కడ ఉన్నారో వారి ఫ్రెండ్స్‌కు, కుటుంబ సభ్యులకు సులభంగా తెలిసిపోతుంది. ప్రధానంగా మహిళలకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

వాట్సాప్ అందజేయనున్న రెండో ఫీచర్ ఏమిటంటే... యూజర్లు మొబైల్ నంబర్లు చేంజ్ చేసినప్పుడల్లా ఆ విషయాన్ని తెలియజేస్తూ కొత్త మొబైల్ నంబర్‌ను వేరే మార్గాల్లో ఇతరులకు చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా ఇబ్బంది లేదు. వాట్సాప్‌లో రానున్న ఫోన్ నంబర్ చేంజ్ నోటిఫికేషన్ ద్వారా యూజర్లు చేంజ్ అయిన తమ మొబైల్ నంబర్ గురించిన నోటిఫికేషన్‌ను అవతలి యూజర్‌కు పంపవచ్చు. దీంతో అవతలి వ్యక్తులకు ఆ సందేశం చేరుతుంది. ఫలానా యూజర్ మొబైల్ నంబర్ చేంజ్ చేశాడని వారికి తెలుస్తుంది. త్వరలోనే ఈ రెండు ఫీచర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు లభ్యం కానున్నాయి. ఇక దీంతోపాటు త్వరలో అందించనున్న అప్‌డేట్ ద్వారా వాట్సాప్ యాప్ సైజ్‌ను కూడా భారీగా తగ్గించనున్నారు. దీంతో మొబైల్ స్టోరేజ్ అయిపోతుందని యూజర్లు ఇక దిగులు చెందాల్సిన పని ఉండదు..!

12738

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles