ఐఓఎస్ ట్విట్టర్‌లో కొత్త ఫీచర్..!


Thu,December 20, 2018 12:10 PM

ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై ట్విట్టర్ యాప్‌ను వాడుతున్న వారికి అందులో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై యూజర్లు ట్విట్టర్‌లో లేటెస్ట్, టాప్ ట్వీట్స్ మధ్య సులభంగా స్విచ్ అవ్వచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే యూజర్స్ అభిరుచుల మేరకు వారు ఫాలో అయ్యే ట్విట్టర్ అకౌంట్లను బట్టి టాప్, లేటెస్ట్ ట్వీట్లు వారికి అందుబాటులో ఉంటాయి. ఇక ఈ ఫీచర్‌కు స్పార్కల్ అని పేరు పెట్టారు. ట్విట్టర్ యాప్‌లో ఈ ఫీచర్‌ను కుడి వైపు పైభాగంలో ఉన్న బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా పొందవచ్చు. కాగా ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో ఆండ్రాయిడ్ ట్విట్టర్ యాప్‌లోనూ లభ్యం కానుంది.

947
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles