ట్విట్టర్ యూజర్లకు త్వరలో మరో అద్భుతమైన ఫీచర్


Sat,November 18, 2017 05:23 PM

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ త్వరలో తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందివ్వనుంది. ఇప్పటికే యూజర్లు పంపుకునే ట్వీట్లలో క్యారెక్టర్ల నిడివిని 140 నుంచి 280 కి ఈ మధ్యే పెంచిన విషయం విదితమే. కాగా ఇప్పుడు 'ట్వీట్ స్టార్మ్' పేరిట మరో పవర్‌ఫుల్ ఫీచర్‌ను అతిత్వరలో ప్రవేశపెట్టనుంది.
tweet-storm
ట్విట్టర్ అందుబాటులోకి తేనున్న ట్వీట్ స్టార్మ్ ఫీచర్ వల్ల యూజర్లు తాము ట్వీట్లు ఎన్ని క్రియేట్ చేసుకున్నప్పటికీ వాటన్నింటినీ కలిపి ఒకేసారి పబ్లిష్ చేయవచ్చు. అందుకు గాను ట్విట్టర్‌లో క్యారెక్టర్ లిమిట్ పక్కనే + ఆకారంలో ఓ సింబల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని ప్రెస్ చేస్తూ పోతే యూజర్ ఎన్ని ట్వీట్లను అయినా ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు, వాటిని ఒకేసారి పబ్లిష్ చేసుకోవచ్చు. ఎక్కువగా మల్టిపుల్ ట్వీట్లను పంపుకునే వారికి ఈ ఫీచర్ బాగా పనికొస్తుంది. దీంతో వారు ప్రతి సారీ ట్వీట్‌ను టైప్ చేయడం, పబ్లిష్ చేయడం ఉండదు. అన్ని ట్వీట్లను ఒకేసారి టైప్ చేసి, అన్నింటినీ ఒకేసారి పబ్లిష్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ట్విట్టర్ ఆల్ఫా వెర్షన్‌ను వాడుతున్న వారికి అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనున్నారు.

2429

More News

VIRAL NEWS