రూ.1499కే టొరెటొ వైర్‌లెస్ చార్జర్


Mon,December 10, 2018 01:44 PM

టొరెటొ.. మ్యాజిక్ పేరిట ఓ నూతన వైర్‌లెస్ చార్జర్‌ను భారత మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ చార్జర్‌లో ల్యాంప్‌ను ఏర్పాటు చేశారు.ఇది భిన్న రకాల కలర్లలో వెలుగుతుంది. ఇందులో సెన్సిటివ్ ఇండక్షన్ కాయిల్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్ చార్జింగ్ అయ్యేటప్పుడు ఓవర్ హీట్‌కు గురి కాకుండా ఉంటుంది. ఈ చార్జర్ 9వి-1.1ఎ 10వాట్ల పవర్ ఔట్‌పుట్‌ను ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్‌కు కవర్ ఉన్నప్పటికీ ఈ చార్జర్‌తో ఫోన్‌ను చార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్‌కు స్క్రాచ్‌లు పడకుండా ఈ చార్జర్‌పై యాంటీ స్కిడ్డింగ్ సిలికాన్ కవర్‌ను ఏర్పాటు చేశారు. ఈ చార్జర్‌పై ఉన్న ఎల్‌ఈడీ ఇండికేటర్ చార్జింగ్ వివరాలను సూచిస్తుంది. టొరెటొ మ్యాజిక్ వైర్‌లెస్ చార్జర్ ధర రూ.1,999 గా ఉంది. కానీ రూ.1499కే ఈ చార్జర్‌ను ఆరంభ ఆఫర్ కింద అందిస్తున్నారు. టొరెటొ వెబ్‌సైట్‌తోపాటు పలు ఈ-కామర్స్ సైట్లలోనూ ఈ చార్జర్‌ను కొనుగోలు చేయవచ్చు.

2129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles