రూ.2299 కే టొరెటో ఫ్లెక్సో వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్స్


Mon,May 27, 2019 03:18 PM

టొరెటో కంపెనీ టొరెటో ఫ్లెక్సో పేరిట నూత‌న వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను భార‌త మార్కెట్‌లో తాజాగా విడుద‌ల చేసింది. ఈ ఇయ‌ర్‌ఫోన్స్ 10 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తాయి. వీటితో మ్యూజిక్ విన‌వ‌చ్చు. కాల్స్ చేసుకోవ‌చ్చు. అలాగే వీటిని సుల‌భంగా మడ‌త పెట్టుకోవ‌చ్చు. వీటిని స్వెట్ ప్రూఫ్ డిజైన్‌లో తీర్చిదిద్దారు. బ్లూటూత్ 4.1 ఆధారంగా ఈ ఇయ‌ర్ ఫోన్స్ ప‌నిచేస్తాయి. వీటిపై మల్టీ ఫంక్ష‌న్ బ‌ట‌న్‌ను ఇచ్చారు. ఆ బ‌ట‌న్‌తో కాల్స్ రిసీవ్ చేసుకోవ‌చ్చు, రిజెక్ట్ చేయ‌వ‌చ్చు. అలాగే ఆ బ‌ట‌న్ స‌హాయంతో మ్యూజిక్ ట్రాక్స్‌ను ఫార్వ‌ర్డ్‌, బ్యాక్‌వ‌ర్డ్ చేసుకోవ‌చ్చు. ఇక ఈ ఇయ‌ర్‌ఫోన్స్ రూ.2299 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్నాయి.

972
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles