ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై ల‌భిస్తున్న టోర్ బ్రౌజర్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?


Sun,September 9, 2018 03:30 PM

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న యూజర్లకు శుభవార్త. ఎందుకంటే యూజర్లకు ఇప్పుడు కొత్తగా టోర్ బ్రౌజర్ (Tor Browser) అనే ఓ నూతన ఇంటర్నెట్ బ్రౌజర్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని యూజర్లు ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ బ్రౌజర్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా..? బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్లను కూడా ఈ బ్రౌజర్‌లో ఎంచక్కా ఓపెన్ చేసుకోవచ్చు.

అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా పలు వెబ్‌సైట్లను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్ చేస్తుంటారు. కానీ టోర్ బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే అందులో బ్లాక్ చేయబడిన వెబ్‌సైట్లను కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఈ బ్రౌజర్ యూజర్ల ఫోన్లకు పూర్తి రక్షణనిస్తుంది. ఎలాంటి హానికరమైన వైరస్‌లు, మాల్‌వేర్‌లు ఫోన్‌లో ప్రవేశించకుండా సెక్యూరిటీ కల్పిస్తుంది. దీంతోపాటు పలు ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లలో కామన్‌గా లభించే సదుపాయాలు కూడా ఈ బ్రౌజర్‌లో యూజర్లకు లభిస్తున్నాయి.

2418

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles