ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లను క్రాష్ చేసిన తెలుగు అక్షరం ఇదే


Fri,February 16, 2018 01:25 PM

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడాదికో కొత్త మోడల్‌తో అత్యంత అధునాతన సాంకేతికతో విడుదలవుతోంది ఐఫోన్. విడుదలయ్యే ఐఫోన్ ఎలా ఉంటుందో తెలియకముందే దాని కోసం స్టోర్ల ముందు క్యూ కడతారు. ఇప్పుడు ఆ ఐఫోన్లు కొద్ది రోజులుగా పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఫోన్లో సామర్ధ్యం నెమ్మదించినట్లు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్త మవుతోంది. మెసేజింగ్ యాప్‌ల్లో నెటిజన్లు చేసే చర్చలు, అభిప్రాయాలు, కామెంట్లలో తెలియని పదం ఒకటి ఇప్పడు ఫోన్ స్తంభించిపోవడానికి కారణమైంది. దీనికి గల కారణం ఏంటని కంపెనీ సైతం దర్యాప్తు ప్రారంభించింది. ఈ సమస్య ముఖ్యంగా తెలుగు పదాలను ఉపయోగించే వారి ఫోన్లలో తలెత్తింది.

ఒక భారతీయ భాష ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ఐఫోన్లతో పాటు మిగతా ఉత్పత్తులను క్రాష్ చేస్తోందని యాపిల్ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. తెలుగు భాషలో వాడే ఒక అరుదైన అక్షరమే ఐఫోన్లు స్తంభించిపోవడానికి కారణమని తెలిపింది. ఐమెసేజ్‌యాప్‌లో అక్షరాన్ని ఐఫోన్ ద్వారా పంపించినా లేదా టెక్స్ ఫీల్డ్‌లో దీన్ని టైప్ చేసిన వెంటనే ఫోన్లు పనిచేయకుండా ఆగిపోతున్నాయి. ఐఫోన్లు మాత్రమే కాదు మ్యాక్ బుక్స్, యాపిల్ వాచ్‌లపై కూడా ప్రభావం పడింది. ఈ సమస్యను గుర్తించామని..దీన్ని పరిష్కరించి సంబంధిత అక్షరాన్ని తిరిగి వాడుకలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని యాపిల్ సంస్థ పేర్కొంది.

ఐఓఎస్ 11.2.5 వెర్షన్‌తో పనిచేస్తున్న ఐఫోన్లు, యాపిల్ డివైజ్‌లలో ఈ సమస్య తలెత్తింది. దీనికన్నా ముందుగా వచ్చిన ఐఓఎస్ వెర్షన్ ఉత్పత్తులు బాగానే పనిచేస్తున్నాయి. ఐమెసేజ్, వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్, జీమెయిల్, ట్విటర్‌లో ఈ అక్ష‌రం వాడకం వల్ల ఫోన్లు స్తంభించిపోయాయి. ఈ యాప్‌లు క్రాష్ అవుతూ అన్‌వర్కబుల్ అంటూ సందేశం రావడం.. ప్రతిసారి రీస్టార్ట్ చేయాల్సి వస్తోంది. టెలిగ్రామ్, స్కైప్ యాప్‌లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. మొట్టమొదటిసారిగా ఈ సమస్యను ఇటాలియన్ వెబ్‌సైట్ మొబైల్ వరల్డ్ దీన్ని గుర్తించింది. ఇంతకీ ఆ అక్ష‌ర‌మేంటో తెలుసుకోవాలని ఉందా అదే తెలుగు వాడుక భాషలో అరుదుగా ఉపయోగించే 'జ్ఞా'. ఈ ఒక్క పదం కొద్దిరోజులుగా వినియోగదారులకు నిద్రపట్టకుండా చేసింది.

14901
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles