పేటీఎం 'ఫ్రీడం క్యాష్‌బ్యాక్‌' సేల్‌.. ఆఫర్లే.. ఆఫర్లు!


Fri,August 10, 2018 05:48 PM

ఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ పేటీఎం మాల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీడమ్ క్యాష్‌బ్యాక్ సేల్‌ను షురూ చేసింది. ఈ స్పెషల్ ఆఫర్ ఆగస్టు 15వరకు కొనసాగుతుందని పేటీఎం సంస్థ వెల్లడించింది. వెయ్యికిపైగా ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లతో ఒప్పందం చేసుకొని కస్టమర్లకు వినూత్న అనుభూతిని కలిగించేందుకు ఈసేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రమోషన్ల కోసం రూ.100కోట్లు పెట్టుబడిపెట్టినట్లు వెల్లడించింది. అన్నిరకాల వస్తువులపై రాయితీలు ప్రకటించినట్లు వివరించింది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఆపరెల్స్ తదితర వస్తువులు క్యాష్‌బ్యాక్ సేల్‌లో ఉన్నాయని పేర్కొంది. ఈనెల 11 వరకు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై అదనంగా 10శాతం క్యాష్‌బ్యాక్ అఫర్ వర్తించనుంది. కనీసం రూ.5వేలు కొనుగోలు చేసినవారికి గరిష్ఠంగా రూ.1,250 క్యాష్‌బ్యాక్ లభించనుంది.

ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్ కేటగిరిలో ల్యాప్‌టాప్‌లపై రూ.20వేలు, స్మార్ట్‌ఫోన్లపై రూ.10వేల వరకు క్యాష్‌బ్యాక్, స్మార్ట్‌ఫోన్లకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా కలదు. నిత్యావసర వస్తువులపై గరిష్టంగా 60శాతం రాయితీ ప్రకటించింది. ఫ్యాషన్ అపరెల్స్‌పై 40శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. ఈ స్పెషల్ సేల్‌ను వివిధ రకాల థీమ్స్‌తో నిర్వహిస్తోంది. మిడ్‌నైట్ సూపర్ ఆఫర్స్, ఫ్లాష్‌సేల్, బజార్, రూ.99 స్టోర్, రూ.1 డీల్స్ పేరుతో ఫ్రీడమ్‌సేల్ కొన‌సాగిస్తోంది..

4111

More News

VIRAL NEWS