ఈ నెల 27న ఫ్లిప్‌కార్ట్‌లో గ్రేట్ హానర్ సేల్


Sat,August 25, 2018 03:46 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ది గ్రేట్ హానర్ సేల్ పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా పలు హానర్ స్మార్ట్‌ఫోన్లపై ఆకట్టుకునే రాయితీలు, ఆఫర్లను వినియోగదారులకు అందివ్వనున్నారు. మూడు రోజుల ఈ సేల్‌లో హానర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌కు గాను వన అవర్ ఫ్లాష్ సేల్‌ను నిర్వహించనున్నారు.

ది గ్రేట్ హానర్ సేల్‌లో హానర్ 10 రూ.5వేల తగ్గింపుతో రూ.27,999 ధరకు లభ్యం కానుంది. హానర్ 9 లైట్ (4జీబీ, 64జీబీ) స్మార్ట్‌ఫోన్‌పై రూ.3వేల అదనపు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. హానర్ 9ఐ రూ.3వేల తగ్గింపుతో రూ.12,999 ధరకు లభ్యం కానుంది. ఇక సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో ఫోన్లను కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను ఇస్తారు.

4346

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles