నేటి అర్ధరాత్రి నుంచే చార్జిల మోత.. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నూతన ప్లాన్ల వివరాలు ఇవే..!


Mon,December 2, 2019 11:00 AM

టెలికా కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ముందు నుంచి చెబుతున్నట్లుగానే తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు గాను టారిఫ్‌లను పెంచాయి. ఈ క్రమంలో ఆయా టెలికాం కంపెనీల ప్లాన్ల చార్జిలు 50 శాతం వరకు పెరిగాయి. ఇక పెంచిన ధరల ప్రకారం నేటి అర్ధరాత్రి నుంచే ఆయా టెలికాం కంపెనీలు చార్జిలను వసూలు చేయనున్నాయి.

వొడాఫోన్ ఐడియాలో పెంచిన చార్జిల ప్రకారం అమలులోకి వచ్చిన నూతన ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

కాంబో వోచర్లు


* రూ.49 - రూ.38 టాక్‌టైం, 100 ఎంబీ డేటా, సెకనుకు రూ.2.5 పైసల కాల్ చార్జి, 28 రోజుల వాలిడిటీ
* రూ.79 - రూ.64 టాక్‌టైం, 200 ఎంబీ డేటా, సెకనుకు 1 పైస కాల్ చార్జి, 28 రోజుల వాలిడిటీ

అన్‌లిమిటెడ్ సాచెట్ ప్లాన్


* రూ.19 - అన్‌లిమిటెడ్ ఆన్-నెట్ వాయిస్, 150 ఎంబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, 2 రోజుల వాలిడిటీ

అన్‌లిమిటెడ్ ప్లాన్స్ (28 రోజుల వాలిడిటీ ఉన్నవి)


* రూ.149 - అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2 జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ
* రూ.249 - అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ
* రూ.299 - అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ
* రూ.399 - అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 3జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ

అన్‌లిమిటెడ్ ప్లాన్స్ (84 రోజుల వాలిడిటీ ఉన్నవి)


* రూ.379 - అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 6జీబీ డేటా, 1000 ఎస్‌ఎంఎస్‌లు, 84 రోజుల వాలిడిటీ
* రూ.599 - అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 84 రోజుల వాలిడిటీ
* రూ.699 - అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 84 రోజుల వాలిడిటీ

అన్‌లిమిటెడ్ ప్లాన్స్ (365 రోజుల వాలిడిటీ ఉన్నవి)


* రూ.1499 - అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 24 జీబీ డేటా, 3600 ఎస్‌ఎంఎస్‌లు, 365 రోజుల వాలిడిటీ
* రూ.2399 - అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 365 రోజుల వాలిడిటీ

ఫస్ట్ రీచార్జి ప్లాన్స్


* రూ.97 - రూ.45 టాక్‌టైం, 100 ఎంబీ డేటా, సెకనుకు 1పైస కాల్ చార్జి, 28 రోజుల వాలిడిటీ
* రూ.197 - అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ
* రూ.297 - అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 28 రోజుల వాలిడిటీ
* రూ.647 - అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 84 రోజుల వాలిడిటీ

కాగా వొడాఫోన్ ఐడియా నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నారు. అయితే ఈ కాల్స్ చేయడానికి వినియోగదారులు ప్రత్యేక రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను వారికి రూ.49, రూ.79 రీచార్జి ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక కనీసం రూ.49 అయినా రీచార్జి చేయించుకుంటేనే వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్‌ను కూడా స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది. అదే అన్‌లిమిటెడ్ ప్లాన్లు వాడితే ప్రత్యేక రీచార్జి చేసుకోవాల్సిన పనిలేదు. ఆ ప్లాన్లలోనే ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునేవిధంగా కాల్స్ వస్తాయి.కాగా పెంచిన చార్జిల ప్రకారం ఎయిర్‌టెల్ నూతన ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

* రూ.19 - అన్‌లిమిటెడ్ కాల్స్, 150 ఎంబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, 2 రోజుల వాలిడిటీ
* రూ.49 - రూ.38.52 టాక్‌టైం, 100 ఎంబీ డేటా, 28 రోజుల వాలిడిటీ
* రూ.79 - రూ.63.95 టాక్‌టైం, 200 ఎంబీ డేటా, 28 రోజుల వాలిడిటీ

అన్‌లిమిటెడ్ ప్లాన్స్ (28 రోజుల వాలిడిటీతో)


* రూ.148 - అన్‌లిమిటెడ్ కాల్స్, 2జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు
* రూ.248 - అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు
* రూ.298 - అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు

అన్‌లిమిటెడ్ ప్లాన్స్ (84 రోజుల వాలిడిటీతో)


* రూ.598 - అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు
* రూ.698 - అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు

అన్‌లిమిటెడ్ ప్లాన్స్ (365 రోజుల వాలిడిటీతో)


* రూ.1498 - అన్‌లిమిటెడ్ కాల్స్, 24జీబీ డేటా, 3600 ఎస్‌ఎంఎస్‌లు
* రూ.2398 - అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు

ఇక వొడాఫోన్ ఐడియాలాగే ఎయిర్‌టెల్ కూడా ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు వసూలు చేయనుంది. అందుకు వినియోగదారులు ప్రత్యేక రీచార్జి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారికి రూ.19, రూ.49, రూ.79 ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా రీచార్జి చేసుకుంటేనే వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్‌ను స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది.

7114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles