రూ.13,499కే టీసీఎల్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ


Mon,May 7, 2018 01:54 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు టీసీఎల్, టెన్సెంట్ డిజిటల్ అనే మరో సంస్థ కలిసి సంయుక్తంగా ఐఫాల్కన్ (iFFALCON) పేరిట ఓ కొత్త స్మార్ట్ టీవీ బ్రాండ్‌ను తాజాగా ఆవిష్కరించాయి. క్రమంలోనే ఈ బ్రాండ్ పేరిట కొత్త సిరీస్ స్మార్ట్ టీవీలను టీసీఎల్ తాజాగా విడుదల చేసింది. ఐఫాల్కన్ 32, 40, 55 ఇంచుల సైజ్‌లలో ఈ టీవీలు విడుదలవ్వగా ఇవి వరుసగా రూ.13,499, రూ.19,999, రూ.45,999 ధరలకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్ నుంచి ప్రత్యేకంగా లభిస్తున్నాయి.

ఐఫాల్కన్ 32, 40 ఇంచుల టీవీలలో డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 4జీబీ స్టోరేజ్, 768 ఎంబీ ర్యామ్, వైఫై, ఈథర్‌నెట్, డాల్బీ ఆడియో ఫీచర్లు కామన్‌గా ఉండగా, 55 ఇంచుల మోడల్ టీవీలో క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 16 జీబీ స్టోరేజ్, 2.5 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, వైఫై, ఈథర్‌నెట్, డాల్బీ ఆడియో ఫీచర్లు ఉన్నాయి.

3266

More News

VIRAL NEWS