ఆండ్రాయిడ్ డివైస్‌లకు కొత్త క్లీనింగ్ యాప్..!


Thu,March 15, 2018 03:43 PM

ఆండ్రాయిడ్ డివైస్‌లను వాడుతున్న యూజర్ల కోసం 'టీ బబుల్ క్లీన్ (TBubble Clean)' పేరిట ఓ నూతన క్లీనింగ్ యాప్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.0.3 ఆపైన వెర్షన్ కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.

టీ బబుల్ క్లీన్ యాప్ సహాయంతో యూజర్లు తమ ఆండ్రాయిడ్ డివైస్‌లలో పేరుకుపోయే జంక్ ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. అవసరం లేని యాప్స్‌ను సులభంగా రిమూవ్ చేయవచ్చు. దీంతో ఫోన్‌లో స్టోరేజ్ ఆదా అవుతుంది. బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే బ్యాటరీ పవర్ సేవర్ ఫీచర్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఈ యాప్‌కు లాక్ పెట్టుకునే సదుపాయం ఇచ్చారు. దీంతో ఇతరులు ఎవరూ దీన్ని ఓపెన్ చేసేందుకు వీలు కాదు. అలాగే ఫోన్‌ను ఎప్పుడూ కూల్‌గా ఉంచేలా సీపీయూ కూలర్ ఫీచర్‌ను కూడా ఈ యాప్‌లో అందిస్తున్నారు. అదేవిధంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా ఫోన్ మెమొరీలో అనవసరంగా నిండిపోయే ఫైల్స్‌ను ఈ యాప్ సహాయంతో తొలగించవచ్చు. దీంతో ఫోన్ వేగంగా పనిచేస్తుంది.


2433

More News

VIRAL NEWS