జియో గిగాఫైబర్‌కు పోటీగా టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సేవలు షురూ..!


Mon,August 20, 2018 06:08 PM

డీటీహెచ్ సేవలను అందిస్తున్న టాటా స్కై ఇకపై బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా అందివ్వనుంది. దేశంలో ఉన్న పలు నగరాల్లో ఈ సేవలు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, ఘజియాబాద్, పూణె, భోపాల్, చెన్నై, ఢిల్లీ, గుర్గావ్, థానె, నోయిడాలలో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించారు. ఈ క్రమంలో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకునే వారికి ఉచితంగా వైఫై రూటర్‌ను కూడా అందిస్తున్నారు. కాకపోతే రూ.1200 ఇన్‌స్టాలేష‌న్ చార్జిలను ముందుగా చెల్లించాలి.

1నెల, 3 నెలలు, 5 నెలలు, 9 నెలలు, 12 నెలల కాల వ్యవధి గల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను టాటా స్కై అందిస్తున్నది. నెలవారీ ప్లాన్లలో రూ.999 కు 5 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తున్నది. అలాగే రూ.1150 (10 ఎంబీపీఎస్), రూ.1500 (30 ఎంబీపీఎస్), రూ.1800 (50 ఎంబీపీఎస్), రూ.2500 (100 ఎంబీపీఎస్) ప్లాన్లు కూడా లభిస్తున్నాయి. ఈ ప్లాన్లు అన్నింటిలోనూ అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్నారు. ఇవి కాకుండా నెలవారీ ప్లాన్లలో రూ.999కు 60 జీబీ డేటా, రూ.1250 కి 125 జీబీ డేటాను ఇచ్చే ప్లాన్లను కూడా అందుబాటులో ఉంచారు. కాగా టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సేవలు హైదరాబాద్ నగరంలో మాత్రం అందుబాటులో లేవు. త్వరలో జియో గిగాఫైబర్ రానున్న నేపథ్యంలో అంతకు ముందుగానే టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించడం విశేషం. ఇక రెండింటి మధ్య పోటీ ఎలా ఉంటుందో వేచి చూస్తే తెలుస్తుంది..!

5081

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles