రూ.5,999 కే ట్యాంబో టీఏ 40 స్మార్ట్‌ఫోన్


Sun,December 16, 2018 03:59 PM

మొబైల్స్ తయారీదారు ట్యాంబో తన నూతన స్మార్ట్‌ఫోన్ టీఏ-40 ని తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ముందు, వెనుక ఉన్న కెమెరాలు రెండింటికీ ఫ్లాష్ సదుపాయం ఏర్పాటు చేశారు.ముందు కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. బ్లూ, రెడ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.5,999 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.

ట్యాంబో టీఏ 40 ఫీచర్లు...

5.45 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ.

4870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles