రూ.3699 కే సిస్కా స్మార్ట్ టేబుల్ ల్యాంప్


Fri,August 10, 2018 01:06 PM

ఎలక్ట్రికల్ ఉపకరణాల తయారీదారు సిస్కా ఎల్‌ఈడీ వైఫై ఆధారంగా పనిచేసే స్మార్ట్ టేబుల్ ల్యాంప్‌ను తాజాగా భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అమెజాన్ అలెక్సా డివైస్‌కు ఇది అనుసంధానమవుతుంది. దీంతో అలెక్సా ద్వారా ఈ ల్యాంప్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఈ స్మార్ట్ ల్యాంప్‌లో మూడు రకాల కలర్ టెంపరేచర్స్ లభిస్తున్నాయి. వార్మ్ వైట్, డే లైట్, కూల్ వైట్ అని మూడు భిన్నమైన కలర్ టెంపరేచర్స్‌లో ల్యాంప్‌ను సెట్ చేసుకోవచ్చు. అలెక్సా వాయిస్ కమాండ్ల ద్వారా ఈ ల్యాంప్ బ్రైట్‌నెస్, ఇతర సెట్టింగ్స్‌ను సెట్ చేయవచ్చు. 30వేల గంటల లైఫ్‌ను ఈ ల్యాంప్ కలిగి ఉంది. రూ.3699 ధరకు సిస్కా స్మార్ట్ టేబుల్ ల్యాంప్ వినియోగదారులకు అమెజాన్ ద్వారా లభిస్తున్నది.

2679

More News

VIRAL NEWS

Featured Articles