కిరాణా సరుకుల‌ను డెలివ‌రీ చేయ‌నున్న స్విగ్గీ..!


Tue,February 12, 2019 04:12 PM

ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ యాప్ స్విగ్గీ ఇక‌పై క‌స్ట‌మ‌ర్ల‌కు కిరాణా స‌రుకుల‌ను కూడా డెలివ‌రీ చేయ‌నుంది. ఈ మేర‌కు స్విగ్గీ ఇవాళ స్విగ్గీ స్టోర్స్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌లోకి యూజ‌ర్లు లాగిన్ అయి త‌మ ఇంటి నుంచే త‌మ‌కు కావ‌ల్సిన నిత్యావ‌స‌రాలు, ఇత‌ర కిరాణా స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. త‌మ సిటీలో ఉన్న పాపుల‌ర్ స్టోర్స్ నుంచి క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు కావ‌ల్సిన స‌రుకులను తెప్పించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఆయా సిటీల్లో ఉన్న పాపుల‌ర్ స్టోర్స్‌తో స్విగ్గీ భాగ‌స్వామ్యం అయింది. ఇక స్విగ్గీ స్టోర్స్ సేవ‌లు ప్ర‌స్తుతానికి గుర్గావ్‌లోనే ప్రారంభ‌మ‌వ‌గా త్వర‌లో దేశంలోని ప‌లు ఇతర న‌గ‌రాలు, ప‌ట్టణాల్లోనూ ఈ సేవ‌ల‌ను ప్రారంభించ‌నున్నారు. ఆయా సిటీల్లో ఉన్న కిరాణా షాపులు, సూప‌ర్ మార్కెట్లు, పాన్ షాపులు, పెట్ కేర్ స్టోర్స్‌, ఫ్లోరిస్ట్స్‌, బేబీ కేర్ స్టోర్స్‌, ఆర్గానిక్ స్టోర్స్‌లో ల‌భించే వ‌స్తువుల‌ను స్విగ్గీ క‌స్ట‌మ‌ర్లు ఆర్డ‌ర్ చేసి పొంద‌వచ్చు.

2091

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles