ఒక్క‌సారి చార్జ్ చేస్తే 50 రోజులు బిందాస్‌


Fri,April 21, 2017 03:18 PM

న్యూఢిల్లీ: ఈ స్మార్ట్‌ఫోన్ల యుగంలో యాప్స్ ఎక్కువైపోయి మొబైల్స్‌లో చార్జింగ్ ఒక్క‌రోజు రావ‌డ‌మే గ‌గ‌న‌మైపోయింది. అలాంటిది ఈ ఫోన్‌ను ఒక్క‌సారి చార్జ్ చేస్తే చాలు 50 రోజుల వ‌ర‌కు టెన్ష‌నే ఉండ‌దట‌. జివి మొబైల్స్ అనే కంపెనీ కొత్త‌గా సుమో టీ3000 పేరుతో ఫీచర్ ఫోన్‌ను శుక్ర‌వారం లాంచ్ చేసింది. ఇందులో 3600 ఎంఏహెచ్ గ‌ల శ‌క్తివంత‌మైన బ్యాట‌రీని అమ‌ర్చిన‌ట్లు కంపెనీ సీఈవో పంజ‌క్ ఆనంద్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. దీని ధ‌రను రూ.1490గా నిర్ణ‌యించారు. 2.8 అంగుళాల డిస్ ప్లే. కెమెరా విత్ ఫ్లాష్‌, ఆటో కాల్ రికార్డ్‌, మొబైల్ ట్రాక‌ర్‌, టార్చ్‌లైట్‌, జీపీఆర్ఎస్‌లాంటి ఫీచ‌ర్లు ఈ మొబైల్‌లో ఉండ‌టం విశేషం.

4073

More News

VIRAL NEWS