లాక్ స్క్రీన్‌పై లైవ్ న్యూస్ అప్‌డేట్లను ఇచ్చే యాప్..!


Tue,November 14, 2017 06:40 PM

ఎప్పటికప్పుడు కొత్త వార్తలు, వింతలు, విశేషాల సమాచారాన్ని ఫోన్‌లో తెలుసుకుంటూ ఉంటారా ? బ్రేకింగ్ న్యూస్‌ను ఫాలో అవుతారా ? అయితే 'స్ట్రింగ్స్ లైవ్ న్యూస్ టిక్కర్ (Strings - Live News Ticker)' అనే ఈ యాప్ మీ కోసమే. దీని సహాయంతో బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్లను మీరు మీ ఫోన్ లాక్‌స్క్రీన్‌పైనే చూడవచ్చు. ఫోన్ అన్‌లాక్ చేసి లోపలికి వెళ్లి వేరే యాప్‌ను ఓపెన్ చేసి న్యూస్ చూడాల్సిన పనిలేదు. ఎంచక్కా మొబైల్ డేటా ఆన్ చేసి ఉంచితే చాలు, దాంతో ఫోన్ లాక్ స్క్రీన్‌పైనే లైవ్ న్యూస్ అప్‌డేట్స్‌ను టిక్కర్ రూపంలో చూడవచ్చు.

Strings - Live News Ticker యాప్ ఆండ్రాయిడ్ డివైస్ యూజర్లకు లభిస్తున్నది. దీన్ని యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.4 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేసి అందులో కనిపించే వివిధ కేటగిరిలను ఎంచుకుంటే చాలు, దాంతో ఆయా కేటగిరిలకు చెందిన బ్రేకింగ్ న్యూస్ యూజర్ ఫోన్ లాక్ స్క్రీన్‌పై టిక్కర్ రూపంలో స్క్రోల్ అవుతూ కనిపిస్తాయి. ఏదైనా ముఖ్యమైన న్యూస్ ఉంది అనుకుంటే యాప్‌ను ఓపెన్ చేయవచ్చు. లేదంటే ఫోన్ లాక్‌స్క్రీన్‌పై వచ్చే న్యూస్ అప్‌డేట్లను చూస్తే సరిపోతుంది.

2081

More News

VIRAL NEWS