ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు కొత్త మ్యూజిక్ ప్లేయ‌ర్ యాప్‌...


Wed,July 6, 2016 04:36 PM

ఆండ్రాయిడ్ డివైస్‌ల‌ను వాడుతున్న యూజ‌ర్ల కోసం 'సౌండిఫ్యా - ప్లే మ్యూజిక్ అండ్ ట్యాగ్ (Soundifya - Play Music & Tag)' పేరిట ఓ నూత‌న యాప్ తాజాగా అందుబాటులోకి వ‌చ్చింది. యూజ‌ర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్ష‌న్ ఉన్న డివైస్‌ల‌లో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.

సౌండిఫ్యా యాప్ ద్వారా యూజ‌ర్లు త‌మ త‌మ డివైస్‌ల‌లో ఉన్న వివిధ ర‌కాల పాట‌ల‌ను, మ్యూజిక్ ఫైల్స్‌ను సుల‌భంగా ప్లే చేసుకోవ‌చ్చు. అదేవిధంగా ఆడియో ఫైల్స్‌ను యాప్‌లోని టాగ్ ఎడిట‌ర్ స‌హాయంతో టాగ్ చేసుకోవ‌చ్చు. ఆల్బం ఆర్ట్ గ్రాబ‌ర్ ద్వారా స‌ద‌రు ఆడియో ఫైల్‌కు చెందిన వివ‌రాల‌ను ఇంట‌ర్నెట్ నుంచి తెలుసుకోవ‌చ్చు. యూజ‌ర్లు త‌మ‌కిష్ట‌మైన పాట‌ల‌తో కూడిన ప్లే లిస్ట్‌ల‌ను సేవ్ చేసుకునే వీలు క‌ల్పించారు. డివైస్‌లోని ప‌లు ఫోల్డ‌ర్ల‌లో ఉండే మ్యూజిక్ ఫైల్స్‌ను సుల‌భంగా యాక్సెస్ చేసుకోవ‌డం కోసం మ్యూజిక్ లైబ్ర‌రీ ఫీచ‌ర్‌ను కూడా ఈ యాప్‌లో అందిస్తున్నారు.

2421

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles