రూ.1890 కే సౌండ్ వ‌న్ బ్లూటూత్ నెక్‌బ్యాండ్


Mon,February 11, 2019 04:45 PM

సౌండ్ వ‌న్‌.. ఎక్స్‌60 పేరిట ఓ నూత‌న వైర్‌లెస్ బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయ‌ర్‌ఫోన్స్‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో సిరి, గూగుల్ అసిస్టెంట్‌ల‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. మెడ చుట్టూ సుల‌భంగా అమ‌రే విధంగా ఈ ఇయ‌ర్‌పోన్స్‌ను రూపొందించారు. ఇవి బ్లూటూత్ 4.2 ఆధారంగా ఫోన్ల‌కు క‌నెక్ట్ అవుతాయి. ఐపీఎక్స్‌5 వాట‌ర్ రెసిస్టెంట్ ఫీచ‌ర్‌ను వీటిలో అందిస్తున్నారు. అందువ‌ల్ల వ‌ర్షంలోనూ వీటిని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఒక సారి ఈ ఇయ‌ర్ ఫోన్స్‌ను చార్జింగ్ పెడితే 8 గంట‌ల వ‌ర‌కు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. ఈ ఇయ‌ర్‌ఫోన్స్ అస‌లు రూ.3490 కాగా వీటిని కేవ‌లం రూ.1890 కే ఫ్లిప్‌కార్ట్ సైట్ నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. లాంచింగ్ ఆఫ‌ర్ కింద ఈ ఇయ‌ర్‌ఫోన్స్‌ను త‌క్కువ ధ‌ర‌కే అందిస్తున్నారు.

2072
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles