ఇక‌పై ఆండ్రాయిడ్ యాప్స్‌ను విండోస్ పీసీల్లో ర‌న్ చేయొచ్చు..!


Wed,March 13, 2019 02:42 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ త‌న విండోస్ 10 పీసీ యూజ‌ర్ల కోసం త్వ‌ర‌లో మ‌రో నూత‌న ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తేనుంది. ఫోన్ స్క్రీన్ పేరిట ల‌భ్యం కానున్న ఈ ఫీచ‌ర్ ద్వారా యూజ‌ర్ త‌న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విండోస్ పీసీకి మిర్ర‌ర్ చేయ‌వ‌చ్చు. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్ విండోస్ పీసీ స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. ఈ క్ర‌మంలో ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండే యాప్స్‌ను విండోస్ పీసీలో ర‌న్ చేయ‌వ‌చ్చు. అయితే ఈ ఫీచ‌ర్ ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. త్వ‌రలోనే దీన్ని పూర్తి స్థాయిలో అంద‌రికీ అందుబాటులోకి తేనున్నారు. ప్ర‌స్తుతం శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8 ప్ల‌స్‌, ఎస్‌9, ఎస్‌9 ప్ల‌స్ ఫోన్ల‌కు మాత్ర‌మే ఇలా మిర్ర‌రింగ్ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించారు. కానీ పూర్తి స్థాయి వెర్ష‌న్‌లో ఇత‌ర కంపెనీల‌కు చెందిన ఆండ్రాయిడ్ ఫోన్ల‌న్నింటికీ ఫోన్ స్క్రీన్ ఫీచ‌ర్‌ను అందివ్వ‌నున్నారు.

831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles