అతి త్వ‌ర‌లో వాట్సాప్‌లో పేమెంట్స్ ఫీచ‌ర్‌..!


Thu,August 10, 2017 05:24 PM

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో అతి త్వ‌ర‌లో పేమెంట్స్ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. కాగా ఇప్ప‌టికే ఈ ఫీచ‌ర్ వాట్సాప్ బీటా వెర్ష‌న్ 2.17.295 లో యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్న‌ది. వాట్సాప్ బీటా వెర్ష‌న్ యాప్‌ను వాడుతున్న వారు పేమెంట్స్ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. యూపీఐ, ఆధార్ అనుసంధానంతో ఈ ఫీచ‌ర్ ప‌నిచేస్తుంది. దీంతో యూజ‌ర్లు ఒక‌రికొక‌రు సుల‌భంగా న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. బిల్స్ చెల్లింపులు కూడా చేయ‌వ‌చ్చు. గ‌త కొంత కాలంగా వాట్సాప్‌లో ఊరిస్తూ వ‌స్తున్న పేమెంట్స్ ఫీచ‌ర్ ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్‌లో ల‌భిస్తుండ‌గా, త్వ‌రలోనే యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి రానుంది.

2339
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles