ఇకపై 2 రోజుల్లోనే ఎంఎన్‌పీ.. వేగవంతం కానున్న ప్రక్రియ..


Sat,November 9, 2019 03:41 PM

దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై ఎంఎన్‌పీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం ఒక టెలికాం కంపెనీ నుంచి మరొక టెలికాం కంపెనీకి వినియోగదారుడు తన మొబైల్ నంబర్‌ను ఎంఎన్‌పీ ద్వారా పోర్ట్ చేసుకునేందుకు 7 రోజుల వరకు సమయం పడుతున్న విషయం విదితమే. అయితే డిసెంబర్ 16వ తేదీ నుంచి అమలు చేయనున్న ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నూతన నిబంధనల ప్రకారం.. కేవలం 2 రోజుల్లోనే ఎంఎన్‌పీ ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో వినియోగదారులు ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు ఎంఎన్‌పీ ద్వారా తమ ఫోన్ నంబర్‌ను పోర్ట్ చేయడం చాలా త్వరగా అయిపోతుంది. ఇక వేరే సర్కిల్‌లో ఉన్న నెట్‌వర్క్‌కు ఫోన్ నంబర్‌ను పోర్ట్ చేయాలంటే మాత్రం 5 రోజుల సమయం పడుతుంది. అదే సర్కిల్ అయితే 2 రోజుల్లోనే నంబర్‌ను పోర్ట్ చేసుకోవచ్చని ట్రాయ్ తెలిపింది.

గతేడాది డిసెంబర్ 13వ తేదీనే ఈ నూతన నిబంధనలను ఫైనల్ చేసినా వాటి అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని ఇప్పటి వరకు ట్రాయ్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూ వచ్చింది. అలాగే టెలికాం కంపెనీలతో నూతన నిబంధనల అమలు విషయంలో ఎదురయ్యే సమస్యలపై కూడా ట్రాయ్ ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 16వ తేదీ నుంచి నూతన ఎంఎన్‌పీ రూల్స్ అమలులోకి రానున్నాయని ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది.

3183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles