జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్‌.. 1000 జీబీ డేటా ప్లాన్‌ ఎంతో తెలుసా..?


Wed,May 10, 2017 12:39 PM

రిలయన్స్ జియో.. టెలికాం రంగంలో ఓ సంచలనం. ''అత్యంత వేగవంతమైన 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను ఫ్రీగా వాడుకోండి, వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఫ్రీ...'' అంటూ యూజర్లను ఆకట్టుకుంది. దీంతో ప్రత్యర్థి సంస్థలకు ముచ్చెమటలు పట్టాయి. జియో కొట్టిన దెబ్బకు ఇప్పటికీ ఇతర టెలికాం సంస్థలు ఇంకా కోలుకోలేదు. అయితే ఇకపై జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సంస్థలకు కూడా గట్టి షాకే ఇవ్వనుంది. జియో ఫైబర్ పేరిట మరో రెండు నెలల్లో సరికొత్త, అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యూజర్లకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిసింది.

ముందుగా మెట్రోనగరాల్లో...
'ఫైబర్-టు-ద-హోమ్ (Fibre-to-the-Home (FTTH))' పేరిట రిలయన్స్ జియో తీసుకురానున్న 'జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్' ముందుగా మెట్రో నగరాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాలతోపాటు గుజరాత్‌లోని జియో హోమ్ టౌన్ జామ్ నగర్‌లోనూ జియో ఫైబర్ ముందుగా అందుబాటులోకి రానుంది. ఆ తరువాత దేశంలో ప్రముఖ పట్టణాలకు విస్తరించనుంది. అనంతరం గ్రామాల్లో కూడా జియో ఫైబర్‌ను ప్రవేశపెట్టనున్నారు.

broadband-internet

మొదటి 3 నెలలు ఫ్రీ...
జియో తన జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను మొదటి మూడు నెలల పాటు యూజర్లకు ఉచితంగా అందివ్వనుంది. ఆ సమయంలో యూజర్లు గరిష్టంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్‌ను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఆ తరువాత రూ.500, రూ.2వేల ప్లాన్లు రెండింటిని ముందుగా ప్రవేశపెట్టనున్నారు. రూ.500 ప్లాన్‌తో 600 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. రూ.2వేల ప్లాన్‌తో 1000 జీబీ డేటా వస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ యూజర్లు గరిష్టంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్‌ను బ్రౌజింగ్ చేసుకోవచ్చు. అయితే నిర్దేశించిన డేటా లిమిట్ పూర్తయితే స్పీడ్ తగ్గుతుంది.

100 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటే...
జియో ఫైబర్ అందించనున్న 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌తో 5జీబీ సైజ్ గల హెచ్‌డీ సినిమాను కేవలం 6 నిమిషాల్లోనే డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుంటుంది. అదేవిధంగా 5 ఎంబీ సైజ్ గల 100 పాటలను కేవలం 24 సెకన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతటి వేగాన్ని జియో ఫైబర్ ఇవ్వనుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్, యాక్ట్, హాత్‌వే వంటి ప్రముఖ సంస్థలతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇక జియో ఫైబర్ వస్తే ఈ సంస్థలు ఎలాంటి ఆఫర్లను ఇస్తాయో వేచి చూడాలి.

4044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles