రెండు నూతన వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను లాంచ్ చేసిన సోనీ


Mon,June 24, 2019 05:43 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ.. రెండు నూతన వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. సోనీ డబ్ల్యూఐ సీ200, డబ్ల్యూఐ సీ310 పేరిట ఈ రెండు ఇయర్‌ఫోన్స్ విడుదలయ్యాయి. సోనీ డబ్ల్యూఐ సీ200 ఇయర్‌ఫోన్స్‌లో బ్లూటూత్ 5.0, 9 ఎంఎం డ్రైవర్, యూఎస్‌బీ టైప్ సి, 15 గంటల ప్లేబ్యాక్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఇయర్‌ఫోన్స్ ధర రూ.2490 గా ఉంది. అలాగే సోనీ డబ్ల్యూఐ సీ310 ఇయర్ ఫోన్స్‌లో 9 ఎంఎం డ్రైవర్, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఇయర్‌ఫోన్స్‌ను రూ.2990 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

916
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles