సోనీ వాటర్ ప్రూఫ్ వైర్‌లెస్ స్పీకర్ విడుదల


Mon,August 12, 2019 03:44 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ.. ఎస్‌ఆర్‌ఎస్-ఎక్స్‌బీ402ఎం పేరిట ఓ నూతన వైర్‌లెస్ స్పీకర్‌ను భారత మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో బ్లూటూత్ 4.2ను ఏర్పాటు చేసినందున ఈ స్పీకర్‌ను ఫోన్లకు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వైఫై ద్వారా కూడా స్పీకర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్పీకర్‌లో ఉన్న ఎక్స్‌ట్రా బేస్ ఫీచర్ వల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. దీనికి వాటర్, డస్ట్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్ ఫీచర్లను అందిస్తున్నారు. ఈ స్పీకర్‌ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 12 గంటల వరకు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. కాగా ఈ స్పీకర్‌ను వినియోగదారులు రూ.24,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే లాంచింగ్ సందర్భంగా ఈ నెల 18వ తేదీ వరకు రూ.19,990 ధరకే ఈ స్పీకర్‌ను అందివ్వనున్నారు.

1203
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles