సోనీ నుంచి హై రిజల్యూషన్ ఆడియో వాక్‌మన్ ప్లేయర్...


Wed,February 10, 2016 06:11 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు సోనీ 'వాక్‌మన్ ఎన్‌డబ్ల్యూ-ఎ25' పేరిట ఓ నూతన హై రిజల్యూషన్ ఆడియో ప్లేయర్‌ను అతి త్వరలో భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. రూ.13,990 ధరకు ఈ ఆడియో ప్లేయర్ వినియోగదారులకు లభ్యం కానుంది.

16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 2.2 ఇంచ్ టీఎఫ్‌టీ ఎల్‌ఈడీ స్క్రీన్, ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. mp3, wav, aiff, wma, aac, he-aac, flac, Apple Lossless వంటి ఆడియో ఫార్మాట్‌లను ఈ ప్లేయర్ సపోర్ట్ చేస్తుంది. డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్‌బీ 2.0, బ్లూటూత్ 3.0 కనెక్టివిటీని ఇందులో అందిస్తున్నారు. దీనికి డిఫాల్ట్‌గా అత్యుత్తుమ క్వాలిటీ కలిగిన హెడ్‌సెట్‌ను ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్లేయర్‌లో DSEE-HX, ClearAudio+ వంటి సౌండ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఉండే ఇన్‌బిల్ట్ బ్యాటరీ ద్వారా 30 గంటల పాటు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ ప్లే బ్యాక్‌ను ఆస్వాదించవచ్చు.

9815

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles