కొత్త ఆండ్రాయిడ్ టీవీలను లాంచ్ చేసిన సోనీ


Mon,September 17, 2018 06:09 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ బ్రావియా సిరీస్‌లో నూతన ఆండ్రాయిడ్ టీవీలను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. బ్రావియా ఎ9ఎఫ్ పేరిట 65, 55 ఇంచుల మోడల్స్‌లో ఈ టీవీలను సోనీ లాంచ్ చేసింది. ఈ టీవీలలో అధునాతన పిక్చర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేసినందువల్ల వీటిల్లో కనిపించే దృశ్యాలు నాణ్యంగా ఉంటాయి. ఇక వీటిలో 4కె ఓలెడ్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ టీవీలలో 16 జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. వీటికి హెచ్‌డీఎంఐ, ఈథర్‌నెట్ పోర్టులు ఉన్నాయి. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 లకు ఈ టీవీలు సపోర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌ను ఏర్పాటు చేసినందున ఈ టీవీలలో గూగుల్ అసిస్టెంట్ కూడా లభిస్తున్నది. ఇక ధర విషయానికి వస్తే 55 ఇంచుల మోడల్ రూ.3,99,990 ధరకు లభిస్తుండగా, 65 ఇంచుల మోడల్ ధర రూ.5,59,990 గా ఉంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ టీవీలను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

4984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles