సోనీ ఫోన్లకు ఆండ్రాయిడ్ 9.0 అప్‌డేట్


Sun,October 21, 2018 05:22 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ తన ఎక్స్‌పీరియా సిరీస్‌లోని పలు ఫోన్లకు నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 9.0 పై అప్‌డేట్‌ను త్వరలో విడుదల చేయనుంది. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్ ప్రీమియం, ఎక్స్‌జడ్1, ఎక్స్‌జడ్1 కాంపాక్ట్‌లకు ఈ నెల 26వ తేదీన నూతన ఓఎస్ అప్‌డేట్ లభిస్తుంది. అలాగే ఎక్స్‌జడ్2 ప్రీమియం ఫోన్‌కు నవంబర్ 7న, ఎక్స్‌ఎ2, ఎక్స్‌ఎ2 అల్ట్రా, ఎక్స్‌ఎ2 ప్లస్ ఫోన్లకు 2019 మార్చి 4న అప్‌డేట్లను విడుదల చేస్తుంది. ఇక సోనీ మాత్రమే కాకుండా అటు హెచ్‌టీసీ, మోటోరోలా, వన్‌ప్లస్ కంపెనీలు కూడా తమ స్మార్ట్‌ఫోన్లు కొన్నింటికి ఆండ్రాయిడ్ 9.0 అప్‌డేట్‌ను విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించాయి. కానీ తేదీలను వెల్లడించలేదు. త్వరలో ఆ వివరాలు కూడా తెలుస్తాయి.

2127

More News

VIRAL NEWS