ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసిన సోనీ


Mon,June 19, 2017 04:37 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ తన బ్రావియా ఎక్స్ సిరీస్‌లో కొత్త స్మార్ట్ టీవీలను తాజాగా విడుదల చేసింది. ఈ టీవీలలో 4కె హెచ్‌డీఆర్ ప్రాసెసర్ ఎక్స్1 ఎక్స్‌ట్రీమ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో వచ్చిన టీవీల కన్నా ఇవి తక్కువ విద్యుత్‌ను వాడుకోవడమే కాదు, క్వాలిటీ పిక్చర్ ఔట్‌పుట్ ను ఇస్తాయి. ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ టీవీల్లో ఏర్పాటు చేశారు. దీంతో నెట్‌ఫ్లిక్స్, గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్ వంటి యాప్‌లను నేరుగా టీవీల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక వీటిలో 4కె అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ కలిగిన వీడియోలను ప్లే చేసుకోవచ్చు. అందుకు తగిన హార్డ్‌వేర్‌ను కూడా వీటిలో ఏర్పాటు చేశారు. సోనీ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీల ధరలు ఇంచులను బట్టి ఈ విధంగా ఉన్నాయి.

* KD-65X9300E ధర రూ. 3,64,900
* KD-55X9300E ధర రూ. 2,64,900
* KD-65X9000E ధర రూ. 2,84,900
* KD-55X9000E ధర రూ. 2,04,990
* KD-49X9000E ధర రూ. 1,54,990
* KD-55X8200E ధర రూ. 1,54,900
* KD-49X8200E ధర రూ. 1,24,900
* KD-43X8200E ధర రూ. 87,900

3759

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles