రూ.5వేలకే స్మార్ట్రన్ కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్


Sat,May 12, 2018 03:53 PM

మొబైల్స్ తయారీదారు స్మార్ట్రన్ తన నూతన ఫిట్‌నెస్ బ్యాండ్ టిబ్యాండ్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.4,999 ధరకు ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ ఈ నెల 13వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో ఈసీజీ, బ్లడ్ ప్రెషర్‌లను కొలిచేందుకు ప్రత్యేకంగా సెన్సార్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా హార్ట్ రేట్ సెన్సార్, యాక్టివిటీ ట్రాకర్, కెలోరీ కౌంట్, స్లీప్ ట్రాకర్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 0.96 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, కాల్, ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్స్ వంటి ఫీచర్లు ఈ బ్యాండ్‌లో ఉన్నాయి. ఇందులో 100 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీని వల్ల ఈ బ్యాండ్ 2 నుంచి 4 రోజుల వరకు బ్యాకప్‌ను ఇస్తుంది. ఆండ్రాయిడ్ 5.0, ఐఓఎస్ 8.3 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లకు బ్లూటూత్ 4.1 ద్వారా ఈ బ్యాండ్ కనెక్ట్ అవుతుంది. దీని కోసం ఆయా ప్లాట్‌ఫాంలపై ప్రత్యేకంగా యాప్ కూడా లభిస్తున్నది.

2936

More News

VIRAL NEWS