స్మార్టిసన్ నుంచి నట్ ఆర్1 స్మార్ట్‌ఫోన్


Wed,May 16, 2018 06:27 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు స్మార్టిసన్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నట్ ఆర్1ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. ఇందులో 6.17 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌లను అమర్చారు. వెనుక భాగంలో 12, 20 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీంతో ఫోన్‌ను ఫేస్ ద్వారా అన్‌లాక్ చేసుకోవచ్చు.

ఇక ఈ ఫోన్ వెనుక భాగంలో ఉన్న ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో డివైస్‌ను కేవలం 0.17 సెకండ్ల వ్యవధిలోనే అన్‌లాక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో ఉన్న బ్యాటరీకి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా అందిస్తున్నారు. స్మార్టిసన్ నట్ ఆర్ 1 ప్రారంభ ధర రూ.37వేలుగా ఉంది.

స్మార్టిసన్ నట్ ఆర్1 ఫీచర్లు...
6.17 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ/1టీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3600 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్.

1659

More News

VIRAL NEWS